చండీగఢ్ : కరోనా మహమ్మరి భారత్‌లో మరోకరిని బలితీసుకుంది. పంజాబ్‌లో కరోనా వైరస్ సోకిన 72 ఏళ్ల వృద్దుడు గురువారం మృతిచెందాడు. దీంతో భారత్‌లో కరోనా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. ఇటీవలే అతను జర్మనీ నుంచి ఇటలీ మీదుగా భారత్‌కు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు కర్ణాటక, ఢిల్లీ, మహారాష్ట్రలలో కరోనా మరణాలు నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం దేశంలో కరోనా సోకినవారి సంఖ్య 167కు చేరింది.
భారత్‌లో మరో ‘కరోనా’ మరణం