అప్పడు నేను చాలా భయపడ్డాను: శ్రుతీహాసన్‌

నటి శ్రుతీహాసన్‌... స్టార్‌ హీరో కూతురిగా కంటే సొంత టాలెంట్‌తోనే చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా గాయనిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, వ్యాఖ్యాతగా విభిన్న కోణాలతో తన అభిమానులను మెప్పిస్తూన్నారు శ్రుతీ. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చిన్ననాటి ఫొటోను అభిమానులు ఇన్‌స్టాగ్రామ్‌లోని శ్రుతీ ఫ్యాన్స్‌ క్లబ్‌ పేజీలో మంగళవారం షేర్‌ చేశారు. ఈ ఫొటోలో ఆమెతో పాటు సుప్రసిద్ధ గాయని  ఆశా భోంస్లే కూడా ఉన్నారు. యూనిఫాంతో ఉన్న చిన్నారి శ్రుతీ.. గాయని ఆశా భోంస్లే ముందు పాట పాడుతూ కనిపించారు. ఈ బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోం‍ది. దీంతో ఇది చూసిన శ్రుతీ.. ‘ఈ ఫొటో అంటే నాకు చాలా ఇష్టం. ఆ రోజు నేను ఈ లెజెండరి గాయని ముందు పాడటానికి చాలా భయపడ్డాను. ఇది నాకు ఓ అందమైన జ్జాపకం. ఫొటోను షేర్‌ చేసి.. నన్ను గత జ్ఞాపకంలోకి తీసుకెళ్లినా మీకు ధన్యవాదాలు’ అంటూ కామెంట్‌ చేశారు. (అవును.. ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకున్నా!)